నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా లవ్ స్టోరీ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఫిదా సినిమా అనంతరం శేఖర్ కమ్ముల చాలా గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల కాలంలో మంచి బజాజ్ క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఓ వర్గం ప్రేక్షకులు అయితే ఈ అంచనాలను మరింతగా పెరిగాయి. సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక సినిమా నిర్మాతలు కూడా టికెట్ రేట్ల విషయంలో కాస్త ముందుచూపుతో ఆలోచిస్తున్నట్లు సమాచారం.
గతంలో పరిస్థితులు బాగున్నప్పుడు కూడా పెద్ద సినిమాల టికెట్ల రేట్లు మొదటివారంలో ఒక్కసారిగా పెరిగిపోయేవి. ఇక ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ధియేటర్లోకి జనాలు రావడమే కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో టికెట్ల రేట్లు పెంచితే ఎంతవరకు వస్తారా అనేది పెద్ద మిస్టరీ అని చెప్పవచ్చు. కానీ అవేవీ పట్టించుకోకుండా లవ్ స్టొరీ నిర్మాతలు మల్టిప్లెక్స్ లలో రూ.200 అలాగే సింగిల్ స్క్రీన్స్ లలో 150 రూపాయలు టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ఎంత పెద్ద సినిమాకైనా సరే మొదటి నాలుగైదు రోజుల్లోనే మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి హైప్ ఉన్న సమయంలోనే క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రేట్లు కేవలం తెలంగాణలోనే అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment