ప్రభాస్ పూజా హెగ్డే ఇటీవల గోడవపడినట్లు సోషల్ మీడియాలో అనేక రకాల పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే షూటింగ్ కు ఆలస్యంగా వస్తోందని ఆ విషయంలో ప్రభాస్ పూజని ఇదివరకే ఒకసారి హెచ్చిరించారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఇక పూజా కూడా ప్రభాస్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇక ఈ విషయంపై యూవీ క్రియేషన్స్ నిర్మాతలు సీరియస్ అయ్యారు. రూమర్స్ డోస్ ఎక్కువవ్వడంతో క్లారిటీ ఇచ్చేశారు. అందులో ఎలాంటి నిజం లేదని పూజా హెగ్డే చెప్పిన సమయానికి సెట్స్ లో ఉంటుందని అన్నారు. అంతే కాకుండా ప్రభాస్ తో ఆమెకు మంచి స్నేహం ఉందని ఇద్దరు కూడా లొకేషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని కూడా వారు తెలియజేశారు. ఇక సినిమా అవుట్ పుట్ తో కూడా చిత్ర యూనిట్ హ్యాపీగా ఉందని కూడా అన్నారు. సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment