న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఈనెల 10న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా విడుదలైన విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదట థియేటర్లో ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు బాగా లేకపోవడం వలన నిర్మాతలు మంచి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఒక విధంగా ఈ సినిమాకు ఓటీటీలో నెగిటివ్ టాక్ గట్టిగానే వచ్చింది.
టక్ జగదీష్ సినిమా కోసం మొత్తం 34 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అయితే అమెజాన్ ప్రైమ్ 37 కోట్లకు సినిమాను కొనుగోలు చేయగా.. శాటిలైట్ రూపంలో 7.5 కోట్లు వచ్చాయి. ఇక ఆడియో రైట్స్ ద్వారా మరొక రెండు కోట్లు వచ్చాయి హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 5 కోట్లు లభించాయి. ఇలా మొత్తంగా సినిమా 34 కోట్ల పెట్టుబడి పెడితే 51.5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. అంటే నాన్ థియేట్రికల్ గానే సినిమా నిర్మాతలకు 17.5 కోట్ల వరకు లాభాలను అందించింది. ఈ లెక్కన చూసుకుంటే సినిమా మంచి ప్రాఫిట్స్ అందించిందని చెప్పవచ్చు.
Follow @TBO_Updates
Post a Comment