నాగ చైతన్య మరియు సమంతలపై విడాకుల పుకార్లుపై కథనాలు ఏ రేంజ్ లో వినిపోస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుకార్లపై ఇద్దరు నటీనటులు ఇంకా స్పందించలేదు మరియు అభిమానులు కూడా గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే, మీడియా సంస్థలు జంట విడిపోయినట్లు స్టోరీలు అల్లెస్తున్నారు. ఇక ఇంతలో సమంత ఒక రూమర్ పై క్లారిటీ ఇచ్చింది.
తన దుస్తుల బ్రాండ్ సాకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో సంభాషించారు. ఈ సమయంలో, ఆమె అభిమాని ఒకరు, "మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?" అన్న ప్రశ్నకు తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని సమంత క్లారిటీ ఇచ్చింది. అయితే విడాకులపై కూడా అనేక రకాల ప్రశ్నలు ఎదురైనప్పటికి ఆమె ఆ విషయం గురించి స్పందించలేదు. కానీ ఏ రూమర్స్ నిజం కాదని ఆమె ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పారు.
లవ్ స్టారి సినిమా గురించి కూడా ఆమె పెద్దగా స్పంధించకపోవడంతో మళ్ళీ విడాకులపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది.
Follow @TBO_Updates
Follow @TBO_Updates
Post a Comment