హీరో సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైకుపై ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్రగాయాలు కావడంతో అపస్మారక స్థితిలో వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ను సన్నిహితులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగింది. అయితే ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ప్రాణాపాయం లేదు అని అపోలో వైద్యులు వివరణ ఇచ్చారు.
ఇక సాయి ధరమ్ తేజ్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఐపీసీ 336, మోటార్ యాక్ట్ 184 ప్రకారం నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక సాయి ధరమ్ తేజ్‌ను 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తప్పనిసరిగా కోలుకుంటారని అలాగే.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం అని వైద్యులు వివరణ ఇచ్చారు.
Follow @TBO_Updates
Post a Comment