RRR నుంచి టక్ జగదీష్ వరకు.. అగ్ర హీరోల భారీ ఫైట్స్!


టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్, పవన్ సహా మరికొందరు స్టార్ నటులు ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమాల నుండి భారీ యాక్షన్ తో కూడిన పలు ఫైట్స్ వారి వారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులని కూడా ఎంతో ఆకట్టుకోవడం ఖాయం అంటున్నాయి లేటెస్ట్ టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు.

అయితే ప్రచారం అవుతున్న న్యూస్ ప్రకారం పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో క్లైమాక్స్ లో వచ్చే ఫైట్, సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాటలో డెజర్ట్ ఫైట్, ప్రభాస్ సలార్ లో ఫ్యాక్టరీ ఫైట్, బాలయ్య అఖండ లో అఘోరాలతో ఫైట్, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లో గుడిలో వచ్చే భారీ ఫైట్, నాని నటిస్తున్న టక్ జగదీశ్ లో పొలం ఫైట్, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో వచ్చే బోట్ ఫైట్, అలానే వీటితో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ కలిసి చేస్తున్న ఆర్ఆర్ఆర్ వచ్చే భారీ రెయిన్ ఫైట్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ ని ఇవ్వడం ఖాయం అట. ప్రస్తుతం ఈ న్యూస్ ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాల్లోని ఈ ఫైట్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post