సంచలన దర్శకుడు శంకర్ తన కెరీర్‌లో ఎలాంటి సినిమా చేసినా కూడా వీలైనంత వరకు వాటిలో ఎక్కువ భాగం సమాజానికి బలమైన సందేశాన్ని అందించినవే ఉంటాయి.ఇక రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. ఈ చిత్రం ఇటీవల అధికారికంగా ప్రారంభించబడింది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కలెక్టర్‌గా నటిస్తున్నారని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో ఉంటుందట. ఈ చిత్రం భారతీయ శిక్షాస్మృతి గురించి అలాగే చట్టం ఎలా దుర్వినియోగం చేయబడుతుందనే అంశాన్ని ఎక్కువగా హైలెట్ చేస్తుందట. ఈ చిత్రం ద్వారా భారతీయ చట్టంలోని కొన్ని విభాగాల ప్రాముఖ్యతను కూడా శంకర్ వివరించనున్నారు. కార్పొరేట్ సంస్కృతి సామాన్యుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా ఈ చిత్రం తెలియజేస్తుంది. మొత్తం మీద, ఈ చిత్రం అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన సామాజిక డ్రామా మూవీ అని సమాచారం. కియారా అద్వానీ కథానాయిక మరియు దిల్ రాజు నిర్మాత. 2023 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Follow @TBO_Updates
Post a Comment