RC15 - RC 16.. రిలీజ్ ప్లాన్ సెట్!


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR అనంతరం కూడా పాన్ ఇండియా ఫార్మాట్ లోనే అడుగులు వేయబోతున్నారు. అందుకే ఆ రేంజ్ కు తగ్గట్లుగానే కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ముందుగా శంకర్ దర్శకత్వంలో ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను ఫినిష్ చేయబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించబోయే ఆ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

ఇక శంకర్ సినిమా అనంతరం RC16 ప్లాన్ కూడా సెట్టయినట్లు తెలుస్తోంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితోనే సెట్ కావచ్చని తెలుస్తోంది. గతంలో ఇదే కాంబోపై దర్శకుడిని అడుగగా అలాంటిదేమి లేదని అన్నాడు. అయితే ప్రస్తుతం ఓ బడా నిర్మాత మాత్రం చరణ్ - గౌతమ్ కలయికలో పాన్ ఇండియా ప్రాజెక్టును సెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2023 చివరలో లేదా 2024 సమ్మర్ లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.


Post a Comment

Previous Post Next Post