మెగాస్టార్ చిరంజీవి త్వరలో కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే మాస్ ఎంటర్‌టైనర్ మూవీతో బిజీ కానున్నారు. వాల్తేరు వీర్రాజు టైటిల్ చర్చల దశలో ఉన్న విషయం తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కోసం టాలీవుడ్ నటుడు రవితేజను సంప్రదించినట్లు టాక్ వస్తోంది.
అన్నయ్య, శంకరదాదా జిందాబాద్ (అతిధి పాత్రలో) లో రవితేజ మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక బాబీ ద్వారా మరోసారి మెగాస్టార్ తో నటించే అవకాశం ఉందట. అయితే ఈ విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది చిరంజీవికి ఆచార్య సినిమాతో కలిపి మూడు సినిమాలు రాబోతున్నాయి.
Follow @TBO_Updates
Post a Comment