ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మీక మందన్న ఏదైనా బయోపిక్ చేయాలనుకుంటున్నారా అని అడగ్గానే మరో క్షణం ఆలోచించకుండా ఆమె సౌందర్య పేరును ఎంచుకుంది. అంతే కాకుండా ఆమె ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చింది.
నేను పరిశ్రమలోకి రాకముందు, మా నాన్న నన్ను సౌందర్య తరహాలో పోలి ఉంటానని ఎప్పుడూ చెప్పేవారు. ఆమె చేసిన సినిమాలు అలాగే ఎన్నో మంచి పనులు నాకు నచ్చాయి. అవకాశం వస్తే సౌందర్య గారి బయోపిక్ చేయాలనుకుంటున్నాను.. అని రష్మిక వివరణ ఇచ్చింది.
కన్నడలో కిరిక్ పార్టీతో అరంగేట్రం చేసిన ఈ నటి టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ తో చేస్తున్న పుష్ప సినిమా డిసెంబర్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Follow @TBO_Updates
Post a Comment