Prabha - Dilraju - Prashant Neel... Date Fix?


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. ఒక సినిమా తరువాత మరో సినిమాతో గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రాధేశ్యామ్ అనంతరం సలార్ రాబోతుండగా ఆ తర్వాత ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. అయితే దిల్ రాజు కూడా ప్రొడక్షన్ లో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ఆ సినిమాను ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఆ సినిమాలో ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా సోషియో ఫాంటసీ తరహాలో ఉంటుందని ఇదివరకే ఒక టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే నెల అక్టోబర్ 23న రానున్నట్లు సమాచారం. దిల్ రాజు ఈ విషయాన్ని స్పెషల్ గా ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దిల్ రాజు ప్రభాస్ సినిమాను అంతకుమించిన బడ్జెట్ తో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post