ఒక వైపు మీలో ఎవరు కోటీశ్వరులు మరో వైపు బిగ్ బాస్ షో.. రెండు కూడా రియాలిటీ షోలే. ఇక ఇలాంటి సమయంలో ఏ షో మంచి రేటింగ్స్ అందుకుంటుందని అనుకుంటున్న క్రమంలో ఎన్టీఆర్ అయితే కూల్ గా అవుట్ డేటెడ్ షోతో కూడా మంచి రేటింగ్స్ అందుకుంటున్నాడు. ప్రతి వారం కూడా ఈ షో రేటింగ్స్ ను పెంచుకుంటూ వెలుతోంది.
ఎవరు మీలో కోటీశ్వరులు మొదటివారంలో యవారేజ్ గా 5.62 TRPని అందుకుంటూ వచ్చింది. ఇక రెండవ వారంలో యావరేజ్ 6.48 TRP రాగా రెండవ వారంలో యవారేజ్ 7.30 TRP రావడం విశేషం. వారం వారం షో రేటింగ్స్ ఏ స్థాయిలో పెరిగుతుందో ఈ రేటింగ్స్ తో ఈజీగా అర్ధమవుతోంది. అసలైతే ఈ ఇలాంటి షో స్థాయి ఒక్కసారి తగ్గితే మళ్ళీ ట్రాక్ లోకి తేవడం చాలా కష్టం. కానీ ఎన్టీఆర్ అయితే ధీమాగా ముందుకి తీసుకు వెళుతున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్5 మొదటి వారంలో యవారేజ్ గా 6.67 TRP తో కొనసాగింది. ఒక విధంగా EMK 3rd వీక్ ఏవరేజ్ రేటింగ్స్ బిగ్ బాస్ ఏవరేజ్ ని కూడా క్రాస్ చేయడం విశేషం.
Follow @TBO_Updates
Post a Comment