New Release Date for Varun Tej 'Ghani'?


వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గని మూవీ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. కిరణ్ కొర్రపాటి రచన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను రెడుసాన్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక గని మూవీని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 3వ తేదీని ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. త్వరలో సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక సినిమా కోసం ఫిట్నెస్ విషయంలో పూర్తిగా మారిపోయిన వరుణ్ తేజ్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాల్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రధాన పాత్రల్లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు మరియు నవీన్ చంద్ర వంటి వారు కనిపించనున్నారు.


Post a Comment

Previous Post Next Post