శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’తోమరోసారి అక్కినేని నాగ చైతన్య తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సాయి పల్లవి కథానాయిక నటించిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేదిన ఒక నిజ జీవిత సంఘటన నుండి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ ఆల్బమ్ ఇప్పటికే భారీగా క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం, నేపథ్య స్కోర్‌ను సమకూర్చారు. లవ్ స్టోరీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మించింది. ఇక ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో యూఎస్ లో రికార్డు స్థాయిలో విడుదలైంది. ఇక సినిమా రివ్యూలోకి వెళితే..
కథ:
ఆర్మూర్ (నిజామాబాద్) గ్రామానికి చెందిన రేవంత్(నాగ చైతన్య), మౌనిక(సాయి పల్లవి) హైదరాబాద్‌లో ఉంటూ వారు అనుకున్న కలల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో తనకు తానుగా సెట్టవ్వని పరిస్థితులలో మౌనిక రేవంత్ జుంబా డ్యాన్స్ అకాడమీలో డ్యాన్స్ ట్రైనర్ ఉద్యోగం చేయడానికి సిద్ధపడుతుంది. ఇక ఆ తరువాత వారు ఇద్దరు కూడా ప్రేమలో పడతారు. రేవంత్ ఒక దళిత క్రైస్తవుడు ఇక మౌనిక మరో కులానికి చెందిన అమ్మాయి. ఇక రెగ్యులర్ గా వివిధ కులాలకు సంబంధించిన అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైనల్ గా వారి పెళ్లి ఆలోచనలు కూడా బ్రేక్ పడుతుంది. ఇక గతంలోని కొన్ని సంఘటనలు ఒక్కసారిగా ఇద్దరికి తెలియడంతో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. చివరికి వారి కలలను నెరవేర్చడానికి ప్రయత్నించినప్పుడు రేవంత్ మౌనిక ఏ విధంగా ఈ ప్రేమ ప్రయాణంలో పోరాడారు అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
విశ్లేషణ:
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి కాస్త క్లిష్టమైన కథను ఎంచుకున్నాడు. తన రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా ట్రై చేశాడని అనిపించింది. గ్రామీణ తెలంగాణ సమాజంలో కుల-ఆధారిత స్థితి వ్యత్యాసాలను చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ఇక కులం ప్రేమ అనే సున్నితమైన విషయాలను ఈ సినిమా టచ్ చేసిన విధానం సాహసం అనే చెప్పాలి. అదే సమయంలో ఎక్కడా కాంట్రవర్సీకి తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. చాలా తెలుగు సినిమాల్లో కొన్ని కులాలకు సంబంధించిన విషయాలు ఎక్కడో ఒక చోట సరైన క్రమంలో చూపలేదు అనే టాక్ వచ్చేది. కానీ శేఖర్ కమ్ముల ఆ విషయంలో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశాడు. ఆత్మవిశ్వాసంతో నిజంగా రేవంత్ పాత్రను నాగ చైతన్య సులభంగా పోషించాడు. శేఖర్ యొక్క సినిమాల్లో హీరోయిన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహిళా ప్రధాన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, మౌనికతో చాలా మంచి పాత్ర చేయించారు. ఇక సాయి పల్లవి చాలా బబ్లీగా ఉంది. మౌనిక పాత్రకు ఆమె కరెక్ట్ గా సెట్టయ్యింది. ఇక ఈశ్వరి రావు పోషించిన హీరో తల్లి పాత్ర కూడా మరొక హైలెట్ రోల్ అని చెప్పవచ్చు.
లవ్ స్టోరీ అయితే రెగ్యులర్ గా చూసే సినిమాల తరహాలకు చాలా భిన్నంగా ఉంది. ఎన్నో చీకటి కోణాలను కమ్ముల చాలా అర్థవంతంగా చూపించాడు. అయితే సినిమా సెకండ్ హాఫ్ లో ప్రీ-క్లైమాక్స్‌కు వెళ్లే కొద్దీ మధ్యలో కొంత నీరసంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయిలో అలరిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. నిజానికి మౌనిక పాత్ర యొక్క బ్యాక్ స్టోరీ చాలా క్రిటికల్ గా ఉంటుంది. కొంతమంది ప్రేక్షకులకు ఆ పాత్రను రిసీవ్ చేసుకోవడం భారంగాను అసౌకర్యంగా ఉంటుంది. కానీ అదే కథకు చాలా కీలకమైనది. ఏది ఏమైనా సమాజంలోని చీకటి సమస్యలను కమ్ముల చాలా బరువైన ఎమోషన్ తో చూపించాడు. ఇక ఎప్పటిలానే కమ్ముల మధ్య మధ్యలో కొన్ని అనవసర మైన పాయింట్లు హైలెట్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ పాయింట్స్ సినిమా చూస్తేనే తెలుస్తుంది. అలాగే కొన్ని చోట్ల స్లోగా వెళుతున్నట్లు అనిపిస్తుంది. ఇక యువత పెద్దగా అంచనాలు లేకుండా ఎప్పటిలానే కమ్ముల సినిమా అని వెళితే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
పర్ఫెమెన్స్:
రేవంత్‌గా నాగచైతన్య అద్భుతంగా నటించాడు. ఒక విధంగా సినిమాను కథానాయకుడిగా బ్యాలెన్స్ చేశాడు అని చెప్పవచ్చు. సాయి పల్లవి మౌనిక, బబ్లీ గర్ల్ గా ట్రామాతో కలలు కనే అమ్మాయిగా బాగానే ఆకట్టుకుంది. ఇక ఈశ్వరి రావు, దేవయాని తల్లి పాత్రలు కూడా కథలో మరొక కీలకం అని చెప్పవచ్చు. రాజీవ్ కనకాల, ఉత్తేజ్ వంటి వారు కూడా కథను మలుపు తిప్పే పాత్రల్లో అద్భుతంగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
👉నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్
👉మ్యూజిక్, మంచి పిక్చరైజేషన్
👉శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ సెన్సిబుల్ డైలాగ్స్
👉ఎమోషనల్ సీన్స్
👉 ఫస్ట్ హాఫ్ సన్నివేశాలు
నెగిటివ్ పాయింట్స్:
👉మధ్య మధ్యలో సమయాల్లో నెమ్మదిగా సాగడం
👉కమర్షియల్ ఆడియెన్స్ కు అంతగా ఆకట్టుకోదు
బాటమ్ లైన్: కమ్ముల సరికొత్త లవ్ స్టొరీ
రేటింగ్: 3.25
Post a Comment