నటుడు సోనూసూద్ నివాసం మరియు కార్యాలయ స్థలాలపై గత మూడు రోజులుగా ఆదాయపు పన్ను (ఐటి) శాఖ దాడులు నిర్వహించింది. 72 గంటల సెర్చ్ తరువాత, సోనూ సూద్ రూ .20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు, మరిన్ని వివరాలను సేకరిస్తిన్నట్లు IT శాఖ ఒక నిర్ధారణకు వచ్చింది.
ఐటి శాఖ ఒక ప్రకటనలో సోను సూద్ పన్ను ఎగవేతలో పాల్గొన్నట్లు ఆధారాలు కనుగొన్నట్లు తెలిపారు. అతను స్థాపించిన ఫౌండేషన్ ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు రూ .18 కోట్ల విరాళాలు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక అందులో రూ .1.9 కోట్లు మాత్రమే ఖర్చు చేయబడ్డాయట. మిగిలిన రూ .17 కోట్లు లాభాపేక్షలేని బ్యాంక్ ఖాతాలో ఉపయోగించబడలేదు.
నటుడు గతంలో తీసుకున్న అప్పులను కూడా ఐటి శాఖ పరిశీలించింది. మరి ఈ ఆరోపణలపై సోనూసూద్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment