యువ నటుడు నాగ చైతన్య చివరికి లవ్ స్టోరీ చిత్రీకరణ పూర్తి చేసారు. ఈ చిత్రం వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక లాల్ సింగ్ చద్దాతో చైతన్య తన బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. నాగ చైతన్య లైనప్ ప్రస్తుతం గట్టిగానే ఉంది. బ్రేక్ లేకుండా పని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు.
అతను అక్టోబర్ మొదటి వారం నుండి విక్రమ్ కె కుమార్ థాంక్యూ షూట్‌ను తిరిగి ప్రారంభిస్తాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాగ చైతన్య ఒక చిత్రానికి సంతకం చేసాడు. షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నాగ చైతన్య థాంక్యూ చిత్రీకరణ పూర్తి కాగానే ఆ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ కోసం కూడా వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సంవత్సరం ఆ వెబ్ కంటెంట్ షూటింగ్ ప్రారంభమవుతుంది. ఇక సర్కారు వారి పాట అనంతరం ఆ సినిమా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయాల్సి ఉంది. నాగ చైతన్య మరో రెండు సినిమాల కోసం చర్చలు జరుపుతున్నాడు.
Follow @TBO_Updates
Post a Comment