Exclusive: స్పైడర్ డైరెక్టర్.. ఈ సారి కింగ్ కాంగ్ మూవీ!


గజిని, స్టాలిన్, తుపాకీ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఏఆర్.మురగదాస్ కమర్షియల్ గా సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. ఆ మధ్య మహేష్ తో స్పైడర్ చేసి డిజాస్టర్ అందుకున్నాడు. ఆయన గతంలో మాదిరిగా సినిమాలు చేయడం లేదని చాలా కామెంట్స్ వచ్చాయి. ఇక నెవర్ బిఫోర్ అనేలా మరో భారీ ప్రయోగంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా కింగ్ కాంగ్ లాంటి క్యారెక్టర్ తో విజువల్ వండర్ ను చూపించబోతున్నట్లు సమాచారం.

బిగ్ బడ్జెట్ ఫాంటసీ సినిమాగా రాబోతున్న ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కు ఏ మాత్రం తక్కువకాకుండా గ్రాఫిక్స్ తో భారీ స్థాయిలో 4 భాషల్లో రిలీక్ చేస్తారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇక చివరగా మురగదాస్ రజనీకాంత్ తో చేసిన దర్బార్ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో ఎలాగైనా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని మురగదాస్ ప్లాన్ చేసుకుంటున్నాడు.


Post a Comment

Previous Post Next Post