టాలీవుడ్ సర్కిల్స్‌లో నాగ చైతన్య సమంతలు బెస్ట్ హ్యాపీ కపుల్స్ అని చెప్పవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా వారు విడిపోవడం జరిగిందని విడాకుల కోసం కూడా సిద్దమైనట్లు టాక్ వస్తోంది. ఇక సమంత ఈ ఉదయం తిరుమల సందర్శించారు. ఆమె ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత, మీడియా సమంత వైపు పరుగెత్తింది.
విపరీతమైన ఉత్సాహంతో ఉన్న జర్నలిస్టు ఒకరు జరుగుతున్న పుకార్ల గురించి ఆమెను అడిగారు. అగ్ర నటి తన ఓపికను కోల్పోయి 'బుద్ధుందా' అనే పదంతో కౌంటర్ ఇచ్చింది. ఆలయ సందర్శన కోసం వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. సమంత సోషల్ మీడియా సర్కిల్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఓ వర్గం మీడియాను ఆమె కుక్కలతో పోల్చిన మీమ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆమె ఇటీవల శకుంతలం షూటింగ్ పూర్తి చేసుకుంది. కొంతకాలం తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇవ్వనుంది..
Follow @TBO_Updates
Post a Comment