ఒకప్పుడు చిన్న సినిమాలతోనే బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో లాభాలను అందుకున్నటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇప్పుడు మాత్రం ఎక్కువగా పెద్ద సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న డం విశేషం. అయితే మిగతా నిర్మాతలు హిట్ కాంబినేషన్ ను తెరపైకి తీసుకు వస్తుంటే దిల్ రాజు మాత్రం అందుకు భిన్నంగా ఫామ్ లో లేని దర్శకులతో ప్రయోగాలు చేస్తున్నట్లు అనిపిస్తోంది.
శంకర్ తో రామ్ చరణ్ 15వ ప్రాజెక్టు కోసం భారీగా ఖర్చు చేస్తున్న దిల్ రాజు అలాగే వంశీ పైడిపల్లితో విజయ్ సినిమాకు కూడా అదే స్థాయిలో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. శంకర్ తో సినిమా చేసేందుకు తమిళ నిర్మాతలు వెనుకడుగు వేస్తున్న సమయంలో దిల్ రాజు మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చారు. వంశీ పైడిపల్లి అయితే మహర్షి సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమర్షయల్ సినిమాలు చేస్తాడు కానీ అవి తేడా కొడితే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీళ్ళతో ఏ స్థాయిలో బిజినెస్ చేస్తారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment