Buzz: రాజమౌళి బాలీవుడ్ మూవీ.. నెల రోజుల్లో షూటింగ్ పూర్తి?


ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం RRR కు ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి ఎక్కువగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అగ్ర దర్శకుడు తన తదుపరి చిత్రంలో మహేష్ బాబుతో కలిసి పని చేస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.  ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు సినిమాలో పనిచేయడానికి ముందు బాలీవుడ్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని మరొక టాక్ వైరల్ అవుతోంది.

మహేష్ బాబు 2022 సంక్రాంతికి విడుదల కావాల్సిన సర్కారు వారి పాటతో బిజీగా ఉన్నాడు.  అనంతరం త్రివిక్రమ్‌తో కలిసి మరొక సినిమా చేస్తాడు. ఇక అది 2022 సెకండ్ హాఫ్ లో విడుదల అవుతుంది. మహేష్ ఖాళీ అయ్యేలోపు జక్కన్న ఒక బాలీవుడ్ నటులతో ఒక చిన్న సినిమాను పూర్తి చేయడానికి  ఆసక్తిగా ఉన్నారని టాక్.  ఈ చిత్రం ఒక ప్రయోగాత్మక ప్రయత్నం అని తెలుస్తోంది. లిమిటెడ్ బడ్జెట్‌ తో రూపొందించబడుతుందట. మరొక ట్విస్ట్ ఏమిటంటే జక్కన్న ఒక నెలలో షూటింగ్ పూర్తి చేస్తాడట. ఇక మరో నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి ఆ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తారా లేదా త్రివిక్రమ్ తరహాలో దర్శకత్వ పర్యవేక్షణలో ఉంటారా అనేది అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది.


Post a Comment

Previous Post Next Post