లవ్ స్టోరీ లీక్.. కమ్ముల సినిమాలో హీరోయిన్ పై అత్యాచారం?


లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి పాత్ర (మౌని) ఒక క్లిష్టమైన జీవిత సమస్యను ఎదుర్కొంటుందని తెలిసింది.  సాయి పల్లవి పాత్ర ఆమె మామ ద్వారా అత్యాచారానికి గురవుతుందట. ఆ తరువాత హీరోతో కలిసి ఆ గాయాన్ని ఎలా అధిగమిస్తుంది. మరియు ఆమె తన మామకు ఎలా పాఠం నేర్పుతుంది అనేది కథలో ప్రధాన అంశం అని టాక్ వస్తోంది.

శేఖర్ కమ్ముల సినిమాల్లో గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రయోగం అయితే చేయలేదు. కానీ అతను ఎలాంటి వైలన్స్ ను అయినా కూడా చాలా సెన్సిటివ్ గా అర్థమయ్యేలా చూపిస్తాడు. ఇక లవ్ స్టోరీలో ఆ సీన్ ను ఎలా చూపించారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజీవ్ కనకాల ఈ సినిమాలో సాయి పల్లవి మామగా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత రాజీవ్ ఒక నెగటివ్ షేడ్‌తో ఆ పాత్రను పోషిస్తున్నాడు.  ఈ చిత్రంలో సాయి పల్లవి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అవ్వాలని కోరుకుంటుంది. ఇక నాగ చైతన్య ఒక డ్యాన్స్ స్కూల్ లో అఫీస్ బాయ్ పాత్రలో నటించారు. ఇక మేకర్స్ సెప్టెంబర్ ముగింపు లేదా అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.


Post a Comment

Previous Post Next Post