ఆ రూట్లో కూడా రీమేక్లేనా మామ?


టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలతో ఎక్కువ విజయాలను అందుకున్న హీరోలలో దగ్గుబాటి వెంకటేష్ టాప్ లో ఉంటారని చెప్పవచ్చు. వెంకీ గత 8 ఏళ్లలో ఐదు రీమేక్ సినిమాలు చేశాడు. ఒక స్ట్రైట్ సినిమా తరువాత మరొక రీమేక్  కామన్ గా చేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల నారప్పతో వచ్చిన వెంకీ నెక్స్ట్ దృశ్యం 2తో రాబోతున్నాడు. ఈ రెండు కూడా రీమేక్ సినిమాలే.

అయితే వెబ్ సిరీస్ లు కూడా చేయాలని అనుకుంటున్న వెంకీ ఆ రూట్లో కూడా మళ్లీ సేఫ్ జోన్ లోనే అడుగులు వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక స్పానిష్ వెబ్ కంటెంట్ తోనే ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. అన్నయ్య సురేష్ బాబు తన హోమ్ ప్రొడక్షన్ లోనే ఆ వెబ్ కంటెంట్ రీమేక్ హక్కులను తీసుకోని తెలుగులో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారాట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు టాక్ వస్తోంది. మరోవైపు రానా దగ్గుబాటి కూడా సొంతంగా వెబ్ సీరీస్ లతో ఓటీటీ వరల్డ్ లో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడు. మరి ఆ రూట్లో దగ్గుబాటి ఫ్యామిలీ ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి.


Post a Comment

Previous Post Next Post