ఆరేళ్ళ పాపపై అత్యాచారం జరిపి గత కొన్ని రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న రాజు శవమై కనిపించాడు. వరంగల్ స్టేషన్ గన్ పూర్ వద్ద రాజు రైల్వే పట్టాలపై ఒక వ్యక్తి చనిపోయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే చూడగా అతను రాజు అని గుర్తించారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి అతను దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
అతని చేతికి మౌనిక అని పచ్చబొట్టు ఉండడం వలన పోలీసులు ఈజీగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా పోలీసులు రాష్ట్రమంతా గలిస్తున్న విషయం తెలిసిందే. ఇక వరంగల్ లో ఉన్నట్లు మరోసారి సెర్చ్ చేసిన పోలీసులకు అస్సలు దొరకలేదు. వరంగల్ నుంచి బయట రాష్ట్రాలకు ఎక్కడికైనా పారిపోవాలని అనుకున్న రాజు సడన్ గా రైలులో కొంతమంది అతన్ని గుర్తు పెట్టె సరికి ప్రయాణిస్తున్న ట్రైన్ లో నుంచి దుకేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
Follow @TBO_Updates
Post a Comment