రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. సోమవారం సాయంత్రం ఆయన తమ ఇంటిలో కాలుజారి కిందపడిపోగా.. తొడ దగ్గర తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక వెంటనే ఆస్పత్రికి తీసుకురాగా అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేశారని కూడా వెబ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే అందులో నిజం లేదని రొటీన్ హెల్త్ చెకప్ కోసం కృష్ణం రాజు అపోలోకి వచ్చినట్లు ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుందని అంటూ అలాగే సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా వారి కుటుంబ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. సాయి ధరమ్ ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు కృష్ణంరాజు వివరణ ఇచ్చారు. అలాగే మరికొన్ని రోజుల్లో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలో వైద్యులను కలిసినట్లు కృష్ణంరాజు ప్రకటనలో పేర్కొన్నారు.
Follow @TBO_Updates
Post a Comment