బిగ్ బాస్ సీజన్ 5లో మొదటి వారంలో ఎలిమినెట్ అయిన కంటెస్టెంట్ సరయు రెమ్యునరేషన్ ఎంత అందుకుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అసలైతే ఈ బోల్డ్ బ్యూటీ అయితే హౌస్ లో నుంచి అంత తొందరగా బయటకు వెళ్లే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. తప్పకుండా కొన్ని రోజుల పాటు హల్చల్ చేస్తుందని కూడా ఆమె స్వభావాన్ని బట్టి చాలామంది కామెంట్ చేశారు. కానీ మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది.
అయితే సరయు వారం రోజులకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అనే వివరాల్లోకి వెళితే.. ఆడిషన్స్ కి వెళ్ళిన మొదట్లోనే బిగ్ బాస్ నిర్వాహకులు ఒక వారానికి లక్ష రూపాయలు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అలాగే స్టార్ మా భవిష్యత్తులో ఎలాంటి ప్రోగ్రాములు నిర్వహించిన కూడా వాటికి రావాల్సి ఉంటుంది. అందుకోసం కూడా మరింత పారితోషికం కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారట. ఒక విధంగా సరయుకు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. మరి స్టార్ మా ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏవైనా మంచి అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment