న్యాచురల్ స్టార్ నాని ఒకప్పుడు ఎలాంటి సినిమాలు చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అయితే అందుకునేవి. అయితే చివరగా వచ్చిన రెండు సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కు వెనక్కి తగ్గడంతో ఆ సినిమాలు కనీసం ఓటీటీలో కూడా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయాయి. ఇక ఆ నెగిటివ్ టాక్ అతని భవిష్యత్తు మార్కెట్ పై ఎంతవరకు పడుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తున్నా ఆ మూవీలో నాని నెవర్ బిఫోర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రతి వర్క్ విషయంలో నాని ఇన్వాల్వ్ అవుతున్నాడట. షూటింగ్ అయితే మొత్తం పూర్తయింది. అయినప్పటికీ నాని రెగ్యులర్ గా దర్శకుడితో సినిమా గురించి మాట్లాడుతు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా సలహాలు ఇస్తున్నాడట. ఈ సినిమాతో నాని ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి నాని అంచనాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి
Follow @TBO_Updates
Post a Comment