నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ప్రస్తుతం రూపొందుతున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమిగోస్ క్రియేషన్స్, ఏషియన్ సినిమాస్ సంస్థలపై నిర్మితం అవుతున్న ఈ మూవీ నుండి ఇటీవల విడుదలైన సాంగ్స్ అన్ని కూడా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం, ముఖ్యంగా సారంగదరియా సాంగ్ అయితే మరింత సూపర్ సక్సెస్ కావడంతో అందరిలో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమాని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్టు ఇటీవల డేట్ అనౌన్స్ చేసిన యూనిట్, హఠాత్తుగా మరికొన్నాళ్లు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దానికి కారణం సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అని, ప్రస్తుతం వాటిని నాగచైతన్య తో నిజామాబాద్ లో దర్శకుడు శేఖర్ మళ్ళి చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. అయితే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొన్నాళ్లుగా ఒక పుకారు షికారు చేస్తుండడంతో అది తమ సినిమాకి మైనస్ గా మారే ప్రమాదం ఉందని భావించి యూనిట్ లవ్ స్టోరీ మూవీ ని వాయిదా వేసినట్లు కూడా కొందరు చెప్తున్నారు. ఇక ఈ సినిమాని ఈ నెలాఖరులో లేదా, వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment