టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు. నటుడు ఏషియన్ సినిమాస్‌తో కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలో ఒక మల్టీప్లెక్స్‌ను ఆవిష్కరిస్తున్న విషయం తెలిసిందే. మల్టీప్లెక్స్ పేరు ఏషియన్-విజయ్ దేవరకొండ సినిమాస్ (AVD సినిమాస్). మల్టీప్లెక్స్ పనులు మొత్తానికి పూర్తయినట్లు తెలుస్తోంది.
మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఈరోజు పూజా కార్యక్రమం నిర్వహించరు. AVD సినిమాస్ ప్రారంభోత్సవం గురించి అధికారిక ప్రకటన త్వరలో చేయబడుతుంది. AVD సినిమాస్ ఈ సంవత్సరం దసరా నుండి ప్రదర్శించడానికి అందుబాటులో ఉంటుందట. మరి మొదట ఏ సినిమాతో AVD స్క్రీన్స్ స్టార్ట్ అవుతుందో చూడాలి. ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
Follow @TBO_Updates
Post a Comment