గ్లామరస్ హీరోయిన్ తమన్నా భాటియా తొలి టెలివిజన్ షో అయినటువంటి మాస్టర్ చెఫ్ ఇటీవల జెమినీ టీవీలో మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ షో ఎనౌన్స్మెంట్ వచ్చినప్పుడే తెలుగులో విభిన్నమైన కామెంట్స్ వచ్చాయి. తెలుగు వంటలకు తమన్నా ఎంతవరకు న్యాయం చేస్తుందనే ఊహాగానాలు కూడా చాలానే వచ్చాయి.
ఇక ఇటీవల షో మాస్టర్ చెఫ్ తెలుగు ప్రారంభ ఎపిసోడ్‌కు కేవలం 4.1 TRP మాత్రమే పొందింది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న జెమిని టీవీకి ఇది చాలా నిరాశ కలిగించింది. ఈ దెబ్బతో షో ప్లాప్ అయినట్లేనా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు తమిళ్ లో లోకల్ నటుడు విజయ్ సేతుపతి బాగానే ఆకట్టుకుంటున్నారు. కానీ తమన్నా మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్ లో అయితే ఆకట్టుకోలేదని తెలుస్తోంది. షో రేటింగ్స్ ఇలానే కొనసాగితే కష్టమే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment