సాయిధ‌ర‌మ్ తేజ్ హెల్త్ బులిటెన్ విడుద‌ల‌!


హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైకుపై ప్రమాదానికి గురైన సాయి తేజ్ తీవ్రగాయాలు కావడంతో మొదట అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇక వెంటనే గోల్డెన్‌ అవర్‌లో ట్రీట్‌మెంట్ అందడం వల్లే తేజ్‌కు ప్రాణాపాయం తప్పింది.

ప్రమాదం జరిగిన గంటలోపే వైద్యం అందించడం వల్ల తేజ్‌ను కాపాడగలిగాం అని మెడికవర్ వైద్యులు తెలిపారు. ఇక కాల‌ర్‌బోన్ గాయానికి రేప‌టిలోగా స‌ర్జ‌రీ చేయనున్నట్లు తాజాగా బులిటెన్ విడుదల చేశారు. బాడీ లోప‌ల కూడా ఎలాంటి బ్లీడింగ్ కాలేదుని వైద్యానికి సాయి ధ‌ర‌మ్ తేజ్ స్పందిస్తున్నారని అపోలో వైద్యులు వివరణ ఇచ్చారు. ఇక ఇప్పటికే మెగా హీరోలు టాలీవుడ్ ప్రముఖులు సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లి వచ్చారు.


Post a Comment

Previous Post Next Post