SSMB28: రిలీజ్ డేట్ ఓకే కానీ.. సాధ్యమేనా?


సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న SSMB28 సినిమాపై ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ గా మారింది. గత కొన్ని నెలలుగా ప్రాజెక్టును స్టార్ట్ చేయాలని త్రివిక్రమ్ చేస్తున్న ప్రయత్నాలు ఏవీ కూడా అంతగా సక్సెస్ కావడం లేదు. ఒకవైపు కరోనా మరో వైపు మహేష్ బాబు సర్కారు వారి పాట తో బిజీగా ఉండడం వలన త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టును త్వరగా సెట్స్ పైకి తేలాక పోయాడు

ఇక ఖాళీగా ఉండటం ఇష్టంలేక త్రివిక్రమ్ ఎక్కువగా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు దర్శకుడు సాగర్ కె చంద్ర డైరెక్టర్ అయినప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ తో పాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా మహేష్ బాబు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కూడా దాదాపు పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం ప్రాజెక్టు నవంబర్ లో మొదలు పెట్టి వచ్చే ఏడాది ఏప్రిల్ లోగా ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడట. ఇక 2022 సమ్మర్ అనంతరం సినిమాను  ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షూటింగ్ కు అయితే పెద్దగా సమస్య ఉండదని చెప్పవచ్చు. ఎందుకంటే త్రివిక్రమ్ స్పీడ్ గానే వర్క్ చేస్తాడు. ఇక ప్లాన్ సెట్టయితే మహేష్ బాబు కూడా పెద్దగా ఆలస్యం చేయడు. కానీ సర్కారు వారి పాట ఒకవేళ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటే SSMB28 వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Post a Comment

Previous Post Next Post