టాలీవుడ్ డ్రగ్ కేసు: ఏడు గంటలపాటు రకుల్ విచారణ!


టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసు ఆరోపణల్లో న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ నేడు ఈడీ విచార‌ణ‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. అసలైతే ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలని అధికారులు ఆమెకు నోటీసులు అందించారు. అయితే ర‌కుల్‌ అందుక ఒప్పుకోకుండా మూడు రోజుల ముందుగానే విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని, ఆ రోజు తనకు కుదరకపోవచ్చని మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేసింది.

ఇక ఆమెకు నచ్చినట్లుగానే ఈడీ అధికారులు శుక్రవారం ఈడీ కార్యాలయంలో విచారణ చేశారు. దాదాపు ఏడున్న‌ర గంట‌ల‌కు పైగా విచారించినట్లు తెలుస్తోంది. 2017లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అనంతరం మళ్ళీ డ్రగ్స్ కొనుగోలు కోసం లావాదేవీలు ఏమైనా జరిగాయనే విషయంలో ఈడీ సెలబ్రేటీలను విచారిస్తోంది. ఇక ఇప్పటికే పూరి జగన్నాధ్, ఛార్మి వంటి వారు విచారణలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణ కూడా ముగిసింది.


Post a Comment

Previous Post Next Post