టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 15వ సినిమా నేడు హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా మొదలైంది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు రాజమౌళి బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను అనుకుంటున్నట్లుగా టాక్ వస్తోంది.
విశ్వంభర అనే టైటిల్ అర్థంలోకి వెళితే.. ఏదైనా ఒక పనిని చేయాలనుకునే సామాన్యుడు దాన్ని పూర్తి చేయడానికి ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడు. పోరాటం తో చాకచక్యంగా ముందుకు సాగే వాడిని విశ్వంభర అని అంటారు. ఇక రాజకీయాల్లో ఒక మంచి పని కోసం రంగంలోకి దిగిన హీరో అక్కడ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గాడు. శంకర్ కథకు విశ్వంభర టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని రైటర్ సాయి మాధవ్ బుర్ర సలహా ఇచ్చినట్లు సమాచారం. శంకర్ కూడా ఆ విషయంలో అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఈ టైటిల్ ని ఫిక్స్ చేయకుండా కూడా మరికొన్ని వాటిపై చర్చలు జరపాలని అనుకుంటున్నారు.
Follow @TBO_Updates
Post a Comment