సినిమా ప్రపంచంలో బయోపిక్ ల పర్వం ఏ తరహాలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. ఇక మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవితం కూడా త్వరలోనే వెండితెరపై దర్శనమివ్వనుంది.
ప్రస్తుతం BCCI అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ తన బయోపిక్ పై సోషల్ మీడియా ద్వారా ఒక క్లారిటీ కూడా ఇచ్చేశాడు. భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించి 2006 వరకు జట్టులో కొనసాగిన దాదాకు ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఆయన బయోపిక్ లో ఎవరు కనిపిస్తారు అనేది తెలియాల్సి ఉంది. గంగూలీ బయోపిక్‌ను లువ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో లవ్ రంజన్ రూపొందించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Follow @TBO_Updates
Post a Comment