భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్.. ఏం చేస్కోవాలి థమన్ బయ్యా?


భీమ్లా నాయక్ మొదటి సాంగ్ కోసం గత రాత్రి నుంచి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ లిరిక్స్ కూడా ముందే రావడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే సాంగ్ విడుదల అనంతరం ఓ వర్గం అభిమానులను మాత్రం అంత ఆకట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. 

రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఒక రేంజ్ లో ఉండగా అందుకు థమన్ సెట్ చేసిన కంపోజింగ్ మాత్రం చాలా నీరసంగా ఉన్నట్లు అనిపిస్తోంది. పవర్ స్టార్ పుట్టినరోజున ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో తీన్ మార్ స్టెప్పులు వేయాలని అనుకున్న ఫ్యాన్స్ కు పెద్ద నిరాశే అని చెప్పాలి. సాంగ్ బాగానే ఉన్నా పుట్టినరోజుకు రావాల్సిన సాంగ్ అయితే ఇది కాదు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఫస్ట్ లుక్ టీజర్ లో వచ్చిన లాలా భీమ్లా అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అదే తరహాలో ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ థమన్ బయ్యా అంచనాలను అందుకోలేదని ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.


Post a Comment

Previous Post Next Post