బోయపాటి - బన్నీ.. అఖండ కండిషన్!


కాలం ఎప్పుడు ఒకే తరహాలో ఉండదు. దర్శకుల రిజల్ట్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంయింది. కాబట్టి నిత్యం స్టార్ హీరోలు కూడా వారిపై అంతగా నమ్మకం చూపడం లేదు. ఒకప్పుడు హిట్స్ ఇచ్చిన వారిని కూడా ఫామ్ లో లేకపోతే పక్కనే పెట్టేస్తున్నారు. అయితే బోయపాటి శ్రీను కూడా దాదాపు అదే తరహాలో అనుభవాలను ఎదుర్కొంటున్నారు.

గతంలో ఆయనతో సినిమా చేయాలని మీడియం రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. అల్లు అర్జున్ అయితే భద్ర సమయం నుంచి బోయపాటితో వర్క్ చేయాలని అనుకున్నాడు. మొత్తానికి సరైనోడు సినిమాతో అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. అయితే బోయపాటి కొంతకాలంగా ప్లాప్ లో ఉండడం వలన గత ఏడాది కథ చెప్పినా కూడా ఒప్పుకోలేదు. ఇక రీసెంట్ గా మరొక కథను చెప్పగా అఖండ తరువాత చర్చలు జరుపుదామని అన్నడట. బోయపాటి తొందర పడడానికి కూడా ఒక కారణం ఉంది. ప్రస్తుతం అగ్ర హీరోలు ఎవరు కూడా ఖాళీగా లేరు. బన్నీ వచ్చే ఏడాది దొరికే అవకాశం ఉంటుందని అతనిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి అఖండ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post