బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పడం కష్టం గానే ఉంది. ఓవైపు కరోనా తగ్గిందని థియేటర్స్ ఎప్పటిలానే కొనసాగేందుకు ముస్తాబవుతున్నాయి. కానీ నిర్మాతలు మాత్రం ధైర్యం చేయడం లేదు. ఇక ధైర్యం చేసిన వాళ్ళు కూడా ఊహించని చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. కానీ కొందరు మాత్రం మంచి విజయాల్ని అందుకుంటున్నారు. ఇక తలైవి మాత్రం తడబడిందనే చెప్పాలి.
తమిళ సినీ నటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా కంగనా రనౌత్ నటించిన విషయం తెలిసిందే అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు దారుణమైన ఫలితాన్ని అందుకుంది. దాదాపు యాభై కోట్ల వసూళ్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం కోటి రూపాయలు షేర్ కూడా రాబట్టలేకపోయింది. పైగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేశారు. ఇక కంగనా రనౌత్ తన లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో గతంలో ఓపెనింగ్స్ గట్టిగానే అందుకుంది. కానీ ఈసారి ఆమె తడబడిందనే చెప్పాలి. అయితే నార్త్ లో ఇంకా థియేటర్స్ ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వలేదు. ఆ ప్రభావం సినిమాపై గట్టిగానే పడింది.
Follow @TBO_Updates
Post a Comment