మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గ్యాప్ లేకుండా రెండేళ్ల వరకు వరుసగా సినిమాలను సెట్ చేసుకున్నారు. చూస్తుంటే ఇప్పట్లో ఆయన కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ కూడా కొంతమంది దర్శకులు ఆయనతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్ల ఆలస్యం అయినా పర్వాలేదు అని కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కథ నచ్చితే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు.
20 ఏళ్ల క్రితం చూడాలని ఉంది సినిమాతో మెగాస్టార్ చిరంజీవికి మంచి విజయాన్ని అందించిన గుణశేఖర్ ఆ తర్వాత మృగరాజు సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ డైరెక్టర్ తో మెగా స్టార్ చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది. కుదిరితే ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. గుణశేఖర్ ఇటీవల ఒక కథను చెప్పినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కూడా పాజిటివ్ గా స్పందించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వీరికి కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మరో రెండేళ్ల వరకు వెయిట్ చేయాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment