పుష్ప2: మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ లీక్?


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప పార్ట్ 1 ది రైజ్ షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంది.  కాకినాడ మరియు మారేడుమిల్లి ఫారెస్ట్‌లో పోరాట సన్నివేశాన్ని పూర్తి చేసిన తర్వాత యూనిట్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఒక ప్రత్యేక పాటను చిత్రీకరిస్తుంది.  దీనితో పార్ట్ 1 మొత్తం పూర్తవుతుంది. ఇక ఈ చిత్రం డిసెంబర్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతుంది.

అయితే పుష్ప యొక్క పార్ట్ 2 పై ఆసక్తికరమైన న్యూస్ వైరల్ గా మారింది. రెండవ భాగంలో అల్లు అర్జున్ - ఒక యువ నటి మధ్య సోదరి సెంటిమెంట్ సన్నివేశాలతో కూడిన ప్రత్యేకమైన ట్రాక్ ఉంటుంది. ఆ సీన్స్ చాలా ఏమోషనల్ గా ఉంటాయని తెలుస్తోంది. మరి సుకుమార్ చేస్తున్న ఈ పాన్ ఇండియా ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక పుష్పలో మాలీవుడ్ స్టార్ ఫహద్ ఫాసిల్, కన్నడ నటుడు ధనంజయ మరియు రష్మిక మందన్న ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.


Post a Comment

Previous Post Next Post