మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటికే చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు లుక్ టీజర్ తో పాటు ఎన్టీఆర్ కొమురం భీం లుక్ టీజర్ యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి భారీ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగుతో పాటు హాలీవుడ్ సహా పలు ఇతర భాషలకు చెందిన దిగ్గజ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.
కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల ఉక్రెయిన్ లో ప్రారంభం కాగా దానిని సక్సెస్ఫుల్ గా నిన్నటితో పూర్తి చేసారు. ఇక మూవీ షూట్ కి నిన్న సాయంత్రం గుమ్మడికాయ కొట్టిన యూనిట్, నేడు ఇండియా కి తిరిగి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మొత్తంగా 1005 రోజులు షూట్ చేసారని, తప్పకుండా మూవీ రేపు రిలీజ్ తరువాత అత్యద్భుత విజయం అందుకోవడం ఖాయం అని ఇన్నర్ వర్గాల సమాచారం.
Follow @TBO_Updates
Post a Comment