Pushpa Leaks: ఈసారి ఏకంగా యాక్షన్ సీన్ లీక్!


టాలీవుడ్ బిగ్గెస్ట్ క్యాలెండర్ సినిమా లో ఒకటైన పుష్ప పార్ట్ 1 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యాడ్ లక్ ఏమిటో గాని బ్యాక్ టూ బ్యాక్ లీక్స్ తో సతమతమవుతున్నారు. సర్కారు వారి పాట టీజర్ విడుదల కాకముందే లీక్ దెబ్బ పడగా మొన్న పుష్ప ఫస్ట్ సాంగ్ కూడా అదే తరహాలో లీక్ అయ్యింది.

అలాగే ఇప్పుడు మరొక యాక్షన్ సీన్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ కుర్చీని మడతపెట్టి విలన్స్ ను చితకొట్టే ఆ సీన్ వాట్సాప్ లో కూడా తెగ వైరల్ అవుతోంది. ఎడిటింగ్ రూమ్ లో సీన్ ను ఎడిట్ చేస్తుండగా మొబైల్ తో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఒకసారి సైబర్ క్రైమ్ కు పిర్యాదు చేయగా మళ్ళీ ఇప్పుడు వెంటనే మరొకటి లీక్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ లీక్ పై మైత్రి మూవీ మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Post a Comment

Previous Post Next Post