ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ ఎలక్షన్స్ లో దాదాపుగా చాలా మంది అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు, కాదంబరి కిరణ్ కుమార్, ప్రకాష్ రాజ్ నిలబడుతుండగా వీరిలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ అటు సినిమా ప్రముఖులతో పాటు ఇటు ఆడియన్స్ లో కూడా నెలకొని ఉంది. అయితే ఈ ఏడాది ఎలక్షన్స్ పక్కాగా ఎప్పుడు నిర్వహిస్తారు అనేదానిపై మొన్నటి వరకు క్లారిటీ రాలేదు.
కాగా నేడు కొద్దిసేపటి క్రితం ఎలక్షన్స్ అఫీషియల్ డేట్ ని ప్రస్తుత మా అధ్యక్షడు వికె నరేష్ అనౌన్స్ చేసారు. 2021-23 కి గాను మా ఎలక్షన్స్ ని అక్టోబర్ 10, 2021న నివహించనున్నామని, అలానే తప్పకుండా ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతూ నరేష్ పత్రికా ముఖంగా ఒక ప్రకటన విడుదల చేసారు. దీనితో ఎలక్షన్స్ డేట్ పై జరుగుతున్న ప్రచారానికి ఒక్కసారిగా అడ్డుకట్ట పడింది. మరి ఈ రసవత్తర పోరులో ఎవరు గెలుస్తారో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు ఓపిక పట్టాల్సిందే.
Follow @TBO_Updates
Post a Comment