నాని హీరోగా రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా శ్యామ సింగ రాయ్. సాయి పల్లవి, ఉప్పెన భామ కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుండగా దీనికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన నాని, సాయి పల్లవి లుక్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే లేటెస్ట్ గా అందుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కొన్నేళ్ల క్రితం జరిగిన పీరియాడికల్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ డ్రామా మూవీగా తెరకెక్కుతోందని అంటున్నారు. మడోన్నా సెబాస్టియన్, మురళి శర్మ, రాహుల్ రవీంద్రన్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా భారీ వ్యయంతో హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్నట్లు టాక్. మరి తొలిసారిగా ది ఎండ్, ఆ తరువాత టాక్సీ వాలా సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న రాహుల్ ఈ సినిమా ద్వారా ఎంత మేర సక్సెస్ అందుకుంటారో చూడాలి.
Follow @TBO_Updates
Post a Comment