త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 5 పై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ షో లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ లిస్ట్స్ ఇప్పటికే పలు మీడియా మాధ్యమాల్లో కొద్దిరోజులుగా వైరల్ అవుతోంది. అయితే గత సీజన్ లో ఎంపికైన పార్టిసిపెంట్స్ ని హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ ఐసోలేషన్ లో ఉంచిన బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి పార్టిసిపెంట్స్ ని ఎవరికి వారు తమ ఇళ్లలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉండేలా తగు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
గత రెండు వారాలుగా ఇప్పటికే సెలెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ తగు జాగ్రత్తలతో ఐసోలేషన్ లో ఉన్నారని, మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతున్న ఈ షో విషయంలో ఇప్పటికే బిగ్ బాస్ యూనిట్ పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్ లో పాల్గొనబోయే పార్టిసిపేంట్స్ ఎవరంటే యూట్యూబ్ షణ్ముఖ్ జస్వంత్, నటి సరయు, యాంకర్ రవి, హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ వర్షిణి, నటరాజ్ మాస్టర్, యనీ మాస్టర్, రఘు మాస్టర్, మనస్, నటి శ్వేతా వర్మ, ఆర్ జె కాజల్, విజె లోబో, సిరి హనుమంత్, చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్, టివి నటి నవ్య స్వామి, ఆట సందీప్, సన్నీ విజె.
Follow @TBO_Updates
Post a Comment