2017లో టాలీవుడ్ సినిమా పరిశ్రమని ఎంతో కుదిపేసిన డ్రగ్స్ కేసులో అప్పట్లో కొందరు అనుమానితులను అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ తరువాత అరెస్ట్ అయిన వారి నుండి మరికొందరి పేర్లు రాబట్టింది. ఆ పేర్లలో పలువురు టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన సినిమా నటులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. కాగా అప్పట్లో ఆబ్కారీ శాఖ వారు సమన్లు జారీ చేయడంతో దర్శకుడు పూరి, హీరోయిన్ రకుల్ ప్రీత్, హీరో రవితేజ, రానా దగ్గుబాటి, యువ హీరో తనీష్ తో పాటు మరికొందరిని పిలిపించి ప్రశ్నించారు.
ఇక ఆ కేసు కి సంబందించి లేటెస్ట్ గా అందరికీ మరొక్కసారి ఆబ్కారీ వారు సమన్లు జారీ చేయడంతో నేడు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హైదరాబాద్ లోని కార్యాలయానికి వెళ్లి వారి ముందు హాజరయి పలు విషయాలు వెల్లడించారు. వాస్తవానికి అప్పట్లో డ్రగ్స్ కేసులో సినిమా ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం మని ల్యాండరింగ్ క్రింద వారందరినీ మరొక్కసారి ఒక్కొక్కరుగా పిలిపించి విచారించనునట్లు తెలుస్తోంది. మరి ఈ కేసు ఎప్పటికి ముగుస్తుందో అని ఆ లిస్ట్ లో పేర్లు ఉన్న సినిమా ప్రముఖులందరూ లోలోపల ఆందోళన చెందుతున్నట్లు టాక్.
Follow @TBO_Updates
Post a Comment