కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తీస్తున్న లేటెస్ట్ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తొలిసారిగా నాగ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమాని మంచి యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కిస్తున్నట్లు టాక్. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై శరత్ మరార్, ఏషియన్ సునీల్ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఒక అండర్ కవర్ ఏజెంట్ గా కనిపించనుండగా, ఆయన టీమ్ లో ఒక రా ఏజెంట్ గా కాజల్ నటిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో ఆమెది ఫుల్ లెంగ్త్ యాక్షన్ తో కూడిన పాత్ర అని, అలానే ఆమె క్యారెక్టర్ లో కొంత నెగటివ్ షేడ్స్ కూడా ఉండనున్నాయని సమాచారం. కాగా ఇటువంటి పాత్రని కాజల్ తన కెరీర్ లో తొలిసారిగా పోషిస్తోందని, తప్పకుండా రిలీజ్ తరువాత సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా నుండి రేపు నాగార్జున బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నాయి
Follow @TBO_Updates
Post a Comment