త్రివిక్రమ్ సినిమాలో వకీల్ సాబ్ గర్ల్!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకవైపు పవన్ కళ్యాణ్ సినిమాలను చూసుకుంటూనే మరోవైపు తన సినిమాలకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలలో కూడా వేగాన్ని పెంచుతున్నాడు. ఇక వకీల్ సినిమా విషయంలో త్రివిక్రమ్ హ్యాండ్ అంతగా లేకపోయినప్పటికీ నటీనటుల సంబంధించిన విషయంలో మాత్రం ఆయన ఆలోచనలో దర్శకుడు వేణు శ్రీరామ్ గట్టిగానే ఫాలో అయ్యాడని సమాచారం.

వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగళ్ళ చేసిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇటీవల కాలంలో ఈ తెలుగమ్మాయి కాస్త గ్లామర్ డోసు కూడా పెంచుతొంది. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఫైనల్ చేసినట్లు టాక్ వస్తోంది. ఆ సినిమాతో ఈ బ్యూటీ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోవైపు పవన్ రానా  సినిమాలకు మాటలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.


Post a Comment

Previous Post Next Post