బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న నటుల్లో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మొదట మెజీషియన్ గా పని చేసిన సుధీర్, ఆ తరువాత తన టాలెంట్ తో జబర్దస్త్ లోకి ఎంటర్ అయి తన మార్క్ పంచ్ లు కామెడీ తో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా నటిస్తున్న సుధీర్ కి యువతలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మొదట్లో ఆర్ధికంగా ఎన్నో అవస్థలు పడ్డ సుడిగాలి సుధీర్ నేడు హైదరాబాద్ లో ఏకంగా రెండు ఇళ్ళు కొన్నాడట, అయితే అవి మాత్రమే కాకుండా మరికొన్ని స్థిరాస్థులు కూడా ఉన్నాయట.
నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో సొంతిల్లు ఏర్పరచుకోవడం అంటే సాధారణం కాదు, అటువంటిది హైదరాబాద్ లో రెండు ఇల్లు కొన్నాడంటే సుధీర్ బాగానే కష్టపడి కూడబెట్టివుంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా ఏమి లేని స్థాయి నుండి తనకంటూ ప్రత్యేకముగా క్రేజ్ ని బిల్డప్ చేసుకుని నేడు అంచలంచెలుగా ఎదుగుతున్న సుధీర్ వంటి వ్యక్తులని జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు.
Follow @TBO_Updates
Post a Comment