బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఒక తమిళ్ మూవీ హిందీ రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. తనకు కథ కథనాలు నచ్చితే చాలు, ఆ పాత్ర ఎంతటి కష్టమైనది అయినా సరే పోషించడానికి తాను ఎప్పుడూ సిద్దమే అంటూ తరచు తన ఇంటర్వ్యూ ల్లో చెప్పే జూనియర్ బచ్చన్, ప్రస్తుతం చేస్తున్న తమిళ్ మూవీ ఒత్త సెరుప్పు సైజు 7 మూవీ హిందీ రీమేక్ షూటింగ్ లో అనుకోకుండా గాయాల పాలయినట్టు బి టౌన్ వర్గాల సమాచారం.
కాగా ఆ సమయంలో అభిషేక్ కుడి చేతికి స్వల్ప గాయం అయిందని, వెంటనే వైద్యులు ఆయనకు ప్రధమ చికిత్స అందించగా డాక్టర్ల సూచన మేరకు ఆయన కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నట్లు చెప్తున్నారు. పార్తీపన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రధానపాత్ర పోషిస్తూ స్వయంగా అభిషేక్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక దీనితో పాటు మరొక రెండు సినిమాల షూటింగ్స్ లో కూడా అభిషేక్ పాల్గొననున్నారని త్వరలో వాటికి సంబంధించి అధికారికంగా న్యూస్ వెల్లడి కానుందని ఆయన పిఆర్ టీమ్ వెల్లడించినట్లు తెలుస్తోంది.
Follow @TBO_Updates
Post a Comment