మెగాస్టార్ పై ప్రకాష్ రాజ్ పొగడ్తల జల్లు!!


మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టారో అందరికీ తెలిసిందే. అంతేకాదు మొదటి నుండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిసిన మెగాస్టార్ అంటే అందరికీ మరింత గౌరవం కూడా. అలానే ఇండస్ట్రీ కి సంబంధించి ఎటువంటి అవసరం వచ్చినా అందరికంటే తానే ముందు ఉంది తనవంతుగా సాయం అందించే మెగాస్టార్ చిరరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల టికెట్స్ అలానే ఇతర సమస్యల విషయమై ఇటీవల ఆంధ్ర మంత్రి పేర్ని నాని ని కలిసి ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కోరిన విషయం తెలిసిందే.

అసలు విషయం ఏమిటంటే మొదటి నుండి మెగాస్టార్ తో మంచి అనుబంధం కల్గిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నేడు ఉదయం తన జిమ్ లో మెగాస్టార్ చిరంజీవి ని కలవడం జరిగిందని, ప్రస్తతం ఇండస్ట్రీ కోసం ఆయన చేస్తున్న సేవ అద్భుతం అని, అటువంటి మంచి మనసున్న వ్యక్తి మన తెలుగు సినిమాలో ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం అంటూ నేడు కొద్దిసేపటి క్రితం ప్రకాష్ రాజ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తూ పోస్ట్ ద్వారా తెలిపారు .... !!


Post a Comment

Previous Post Next Post